‘రైతాంగ సమస్యలపై కనీస అవహనలేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జగన్ హయాంలో అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. జగన్ రైతు సమస్యలపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో 20 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పిన వ్యక్తి.. తన ఐదేళ్ల పాలనలో కనీసం రూ.50 కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని, అలాంటి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
#nadendlamanohar #ysjagan #pulivendula #janasena #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️